![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -175 లో..... మాధవ కన్పించడం లేదని ఇంట్లో అందరు బాధపడతారు. మరొకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మాట్లాడుదామని మహా అంటుంది. నేను రాను వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూసారు కదా అని చక్రి అంటాడు. ఏం అన్నా ఇప్పుడు మన అవసరమని కేశవ అంటాడు. ఆ తర్వాత బన్సీకి ఒకసారి ఫోన్ చేద్దామని మహా చేస్తుంది. మనీషా లిఫ్ట్ చేస్తుంది పెద్ది వచ్చాడా అని అడుగుతుంది. లేదని మనీషా చెప్తుంది. ఒకసారి బన్సీకి ఫోన్ ఇవ్వు అనగానే మనీషా ఇస్తుంది. మహా ఏం అడగక ముందే మాధవ బాయ్ ఇక్కడికి రాలేదని చెప్తాడు. దాంతో మహా కి డౌట్ వస్తుంది. ఒకసారి చక్రి మీరు వెళ్ళండి. నాకు అక్కడే ఉన్నాడని డౌట్ వస్తుందని బన్సీ ఇంటికి చక్రిని వెళ్ళమంటుంది.
చక్రి వెళ్లేసరికి మాధవ అక్కడే ఉంటాడు. నేను రాను వెళ్ళిపోరా అని మాధవ చెప్తాడు. దాంతో చక్రి ఎమోషనల్ గా మాట్లాడుతాడు. పాపం వాళ్ళు నిన్నటి నుంచి పిచ్చివాళ్ళలాగా వెతుకుతున్నారని చక్రి చెప్తాడు. నాకు మీరు బాగుండడం ముఖ్యం అని మాధవ అంటాడు. మాధవ కాళ్ళు పట్టుకొని చక్రి రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత మాధవని తీసుకొని చక్రి ఇంటికి వస్తాడు. ఎందుకు వచ్చారని మహా కోప్పడుతుంది. ఇంటికి ఒక తండ్రిలాగా ఉన్నారు.. ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనిపించిందని మహా అంటుంది. మా అన్నయ్య కాదు అన్నయ్య అయితే అలా వెళ్ళిపోతాడా అని కన్నా కోపంగా లోపలికి వెళ్తాడు. కేశవ, చక్రి ఇద్దరు మాధవని పట్టుకొని ఎమోషనల్ అవుతారు. లోపలికి వెళ్తారు. కన్నా అన్నం తినబోతుంటే గొంతు దిగడం లేదు అన్నయ్య అని కన్నా ఏడుస్తాడు. ఆకలిగా ఉందా కన్నా తినిపించాలా అని మాధవ అనగానే మాధవని పట్టుకొని కన్నా ఏడుస్తాడు. ఆ తర్వాత నారాయణ ఇంటికి వస్తాడు. బయట మాధవ చెప్పులు చూసి లోపలికి వస్తాడు. మాధవ చెంపచెల్లుమనిపిస్తాడు.
ఈ ఇంట్లో నన్ను నాన్న అని పిలిచేది నువ్వు ఒక్కడివేరా.. నాకు అమ్మలాగా భోజనం పెట్టేవాడివి.. నువ్వు లేకపోతే నేను ఏమైపోవాలి.. నా ఇద్దరి భార్యలని చంపింది నేను అని లోకమంతా అన్నారు. అవి నేనేం పట్టించుకోలేదు ఎవరో పంతులు ఏదో అన్నాడని నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం కరెక్ట్ కాదు.. నువు మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాకు తలకొరివి పెట్టిన తర్వాతే అని నారాయణ ఎమోషనల్ అవుతాడు. తరువాయి భాగంలో మాధవ జాతకంలో ఎలాంటి దొషాలు లేవు కానీ ఒక మొక్కు ఉంది. అది మీ పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుందని పంతులు చెప్తాడు. నారాయణ ఏదో గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుచేసుకొని టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
SEO Keywords:
![]() |
![]() |